Wednesday, November 28, 2018

శ్రీవారి ఆలయం లోని హుండీ గురించి మీకు తెలియని రహస్యాలు

The Secrets you do not know about the Hindu Temple. The temple of Sri K. Venkateshwara Swamy Temple of Kaliyuga is known to all. The Tirumala Temple is not just about the people of our country, but all the world’s people are aware of this Shri temple.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల  ఆలయం అందరికి తెలిసిందే . తిరుమల ఆలయం గురించి మన దేశం లోని వారికే కాదు ,యావత్ ప్రపంచ దేశాలలోని అందరికి ఈ శ్రీవారి ఆలయం గురించి తెలుసు ఉంటుంది .అంతలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం . ఇక్కడికి ప్రనిత్యం వేల సంఖ్యలలో భక్తులు వస్తుంటారు . ఇక ప్రత్యేక పూజలు ఉన్న రోజుల్లో అయితే లక్షలు దాటిపోతారు . ఇక్కడికి వచ్చే ప్రతిఒక్కరు కూడా శ్రీవారికి కనుకలని హుండీలో వేస్తారు . ఈ కనుకల్ని డబ్బు రూపంలోగాని , వెండి ,బంగారం రూపంలోగాని శ్రీవారికి సమర్పిస్తూ ఉంటారు . ప్రతి రోజు ఇక్కడ కోట్లల్లో ఆదాయం ఉంటుంది . శ్రీవారి ఆలయం లోని హుండీ గురించి తెలియని కొన్ని విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం .

1 .  శంకు చక్రాలు , తిరునామాలు గీసిన రాగి గంగాళాన్ని హుండిగా ఉపయోగిస్తారు . ఈ హుండినే కొప్పెర అని కూడా పిలుస్తారు .
2 . భక్తులు వేసే కానుకలు సరాసరి గంగాళం లో పడేటట్లు ఏర్పాటు చేసిన బుర్కా గంగాళాన్ని కొప్పెర అని అంటారు .
3 .  1821 జులై 25 నా శ్రీవారి ఆలయం లో ఈ హుండీ మొదటగా ఏర్పాటు చేసారు .
4 . 1830 లోనే శ్రీవారి ఆలయం లో హుండీ ద్వారా వచ్చే ఆదాయం నుండి అర్చకులకు , పూజలకు , అర్చనలకి ఖర్చు పోగా అప్పుడే రోజుకి లక్ష రూపాయలు మిగులు ఉండేది . ప్రస్తుతం శ్రీవారి ఒక్క రోజు ఆదాయం కోటి రూపాయాల పై మాటే .
5 .ఆపదలు వచ్చినప్పుడు ఆ స్వామి ని తలచుకొని మా సమస్యలు తీరితే అన్ని హుండీలో వేస్తామని మొక్కుకుంటారు , వారి సమస్యలు తీరాక వచ్చి , వారి ఒంటి పై ఉండే బంగారాన్ని మొత్తం , పర్స్ తో సహా మొత్తం హుండీలో వేస్తారు . దీన్నే నిలువుదోపిడీ అని అంటారు .
6 . హుండీకి సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడా ఉంటారు .హుండీ ని రోజు రెండు సార్లు విప్పుతారు ,అనగా మధ్యాహ్నం 12 గంటల తరువాత , మళ్లీ రాత్రి  ఏకాంత సేవ తరువాతే హుండీ ని విప్పుతారు , రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో నాలుగు , ఐదు సార్లు  కూడా విప్పుతారు .
7 . ఒక సాధారణ రోజులో శ్రీవారి హుండీ ఆదాయం కోటి నుండి 2 .5 కోట్ల వరకు ఉంటుంది . అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయం లో ఈ ఆదాయం మరింత ఎక్కువౌతుంది .